News October 11, 2024

కామారెడ్డి: ఈ ఊళ్లో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం

image

కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్‌లో సద్దుల బతుకమ్మ రోజు కుటుంబ సభ్యుల్లోని మగవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పెద్ద బతుకమ్మలను ఎత్తుకుంటారు. ఏటా ఇలాగే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొంటారు. కేవలం మహిళలకే పరిమితం కాకుండా మగవారు కూడా బతుకమ్మ ఉత్సవాలు ముగిసే వరకు సమయం కేటాయిస్తారు.

Similar News

News November 21, 2025

SRSP: 947.474 TMCల వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.

News November 21, 2025

NZB: ఎన్నికల సాధారణ పరిశీలకునిగా శ్యాంప్రసాద్ లాల్

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం NZB జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకునిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జీవీ.శ్యాంప్రసాద్ లాల్‌ను, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా KMR జిల్లా ఆడిట్ అధికారి జె.కిషన్ పమర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.

News November 21, 2025

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.