News January 27, 2025

కామారెడ్డి: ఉత్తమ లెక్చరర్‌గా వనజ

image

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ లెక్చరర్‌గా వనజ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కళాశాలలో వివిధ బాధ్యతల్లో విధులు సక్రమంగా నిర్వహించినందుకు గాను ఆమె అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో వనజ పని చేస్తున్నారు. అవార్డు రావడంతో కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Similar News

News November 23, 2025

పొల్యూషన్​ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

image

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.

News November 23, 2025

సముద్రంలో దిగి కోనసీమ బాలుడి గల్లంతు

image

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమరాజు (14) ఆదివారం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మలికిపురం ఎస్ఐ సురేష్ వివరాల మేరకు.. బాలుడు ముగ్గురు స్నేహితులతో కలిసి మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌‌లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలో కొట్టుకు పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

NGKL: వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

image

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇల్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మడం మంచిది కాదని ఆమెతో మంత్రి పూజ చేయించారు.