News October 22, 2024

కామారెడ్డి: ఉపాధ్యాయుడు SUICIDE

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఓడపల్లి విజయ్ కుమార్(45) సోమవారం నిజామాబాద్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News November 27, 2025

NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

News November 27, 2025

NZB: చట్టబద్ధత దత్తతనే శ్రేయస్కరం: రసూల్ బీ

image

చట్టబద్ధత దత్తత శ్రేయస్కరం అని మహిళా శిశు సంక్షేమ శాఖ NZB జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బీ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగుల పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

News November 27, 2025

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన NZB కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.