News March 24, 2024

కామారెడ్డి: ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వందమంది బీజేపీ మండలాధ్యక్షుడు తుకారం ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాధవరావు, పండిత్ రావ్ పటేల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2024

నందిపేటలో రక్షణ కోసం రాళ్లు పట్టిన మహిళలు

image

నందిపేటలో ఒకే రోజు వరుసగా పది మందిని పిచ్చి కుక్క విచక్షణారహితంగా కరిచి తీవ్ర గాయాలపాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తమ పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ రక్షణ కోసం రాళ్లు పట్టుకొని వెళ్లే దుస్థితి ఎదురయ్యింది. కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి భయంగా ఉందని అంటున్నారు.

News September 9, 2024

KMR: జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పంటలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. ప్రస్తుత వానకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే.. ఆలస్యమైనా ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా వరి స్థానంలో ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయం కరువైంది.

News September 9, 2024

లింగంపేట్: మటన్ ముక్క కోసం గొడవ

image

మటన్ ముక్కల కోసం కామారెడ్డి జిల్లాలో ఆదివారం గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భోజనాల సమయంలో బంధువులకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని వడ్డించే వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వారు రాజీ పడ్డారని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.