News February 15, 2025
కామారెడ్డి: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 3, 2025
అయ్యప్ప భక్తుల కోసం కాగజ్‌నగర్–కొల్లాం మధ్య ప్రత్యేక రైలు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 13న కాగజ్‌నగర్ నుంచి కొల్లాం జంక్షన్ వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అభ్యర్థనపై ఈ రైలు ఏర్పాటైందని, అన్ని తరగతుల బోగీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మకరజ్యోతి దర్శనానికి కూడా ప్రత్యేక రైలు నడపాలని రైల్వే అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.
News December 3, 2025
కరీంనగర్: ఒత్తిళ్లకు ‘నై’.. సమరానికి ‘సై’..!

కరీంనగర్(R) మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. MA, LLB చదివిన ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వస్తున్న ఒత్తిళ్లను సైతం ఆమె లెక్కచేయకుండా సమరానికి సై అంటున్నారు.
News December 3, 2025
4న మన్యంలో మంత్రి లోకేశ్ పర్యటన

మంత్రి నారా లోకేశ్ ఈనెల 4న భామిని మండలంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకోనున్నారు. 7 నుంచి 9 గంటల వరకు భామినిలో టీడీపీ కార్యకర్తలతో ముఖా ముఖిలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి బస చేసి మరుసటి రోజు స్థానిక ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్&టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.


