News March 30, 2024

కామారెడ్డి: ఎన్నికల వేళా ‘గులాబీ’లో గుబులు

image

పార్లమెంటు ఎన్నికల వేళా బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ZHB పార్లమెంటు పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గ ఓటర్లు అన్ని పార్టీలకు ప్రధానమే. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోయిన మూడు నెలల లోపే BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌, BJP గూటికి చేరుతున్నారు,

Similar News

News October 22, 2025

NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

image

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.

News October 22, 2025

NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.

News October 22, 2025

నిజామాబాద్: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడ్ గ్రామంలోని క్యాంప్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలని, తూకం, మిల్లులకు తరలింపు సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.