News February 14, 2026

కామారెడ్డి: ఎమ్మెల్యేల హవా.. రెండు చోట్లా పీఠాలు సొంతం!

image

కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పట్టును నిరూపించుకున్నారు. బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావులు పీఠాలను దక్కించుకుని రాజకీయంగా తమ ఆధిక్యాన్ని చాటారు. ప్రజలు తమ అభివృద్ధి పనులకు పట్టం కట్టారని, మున్సిపాలిటీల ప్రగతికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

24సార్లు చోరీ చేసినా కేసు పెట్టరా: భూమన

image

తిరుమల పరకామణి చోరీలపై భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెంచలయ్య 556gm బంగారం, 550gm వెండి చోరీ చేశాడు. 24సార్లు చోరీలకు పాల్పడితే ఒక్క కేసూ పెట్టలేదు. S.కృష్ణ కుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ 950 విదేశీ కరెన్సీ నోట్లను చోరీ చేసినా అరెస్ట్ చేయలేదు. వీళ్ల వెనుక ఉన్న తిమింగలాలు ఎవరు’ అని ఆయన ప్రశ్నించారు. పెంచలయ్య దగ్గర రూ.3లక్షలు తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించింది భూమనేనని BR నాయుడు ఆరోపించారు.

News March 11, 2026

అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా: కదిరి ఎమ్మెల్యే

image

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్‌తో కదిరిలో రథోత్సవం సందర్భంగా జరిగిన వివాదంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించారు. ‘కొందరు కావాలనే రచ్చ చేస్తున్నారు. రథంలోకి ఆలయ ఈవో, అర్చకులు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని అనుమతించారు. రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్థసారథి అనుభవజ్ఞుడు. బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు మాట్లాడను. ముగిశాక అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా’ అని స్పష్టం చేశారు.

News March 11, 2026

HYD: వాట్సాప్‌లో కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు!

image

HYDలో కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం నిత్యం రద్దీగా ఉండే ‘మీసేవా’ల చుట్టూ తిరుగుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. GOVT తీసుకొచ్చిన మీ సేవా ఈ వాట్సాప్ <<8096958096>>8096958096<<>> నంబర్‌ సేవ్ చేసుకొని Hi పంపండి. వెంబడే సర్టిఫకెట్ల లిస్ట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లన్నీ అప్లై చేసుకోవచ్చు. 7రోజుల ప్రాసెసింగ్ టైమ్. సమ్మర్ తర్వాత కాలేజీకి వెళ్లేవారికి యూజ్ అవుతుంది.
# SHARE IT