News February 1, 2025
కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.
News December 10, 2025
గొలుగొండ: బాలిక గర్భం దాల్చిన ఘటనపై పోక్సో కేసు నమోదు

గొలుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలిక గర్భం దాల్చిన ఘటనపై విచారణ చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు.
News December 10, 2025
సంగారెడ్డి: రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ పాల్గొన్నారు.


