News February 1, 2025

కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2025

ఇవాళ కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడపకు రానున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ వేడుకలకు జగన్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నగర శివారులోని మేడా ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి 11.30 గంటలకు కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.

News February 14, 2025

సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

image

మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. గురువారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.

News February 14, 2025

రంజీ సెమీస్‌లో ఆడనున్న జైస్వాల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన టీమ్‌ఇండియా ఓపెనర్ జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఆడనున్నారు. ఈనెల 17 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో మ్యాచులో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. తొలుత ప్రకటించిన CT జట్టులో జైస్వాల్ పేరు ఉన్నప్పటికీ తర్వాత అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. జైస్వాల్‌ను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్ లిస్టులో చేర్చారు. అతడు జట్టుకు అవసరమైనప్పుడు దుబాయ్ వెళ్తారు.

error: Content is protected !!