News March 7, 2025
కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర

కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2015 బ్యాచ్‌కు చెందిన రాజేశ్ చంద్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను కామారెడ్డికి బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ సింధు శర్మ ఇంటలిజెన్స్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
Similar News
News February 8, 2026
MDK: మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 8, 2026
నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తనిఖీ

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఫెసిలిటేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 8, 2026
YS జగన్‌తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


