News February 28, 2025

కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

image

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.

Similar News

News December 16, 2025

అనకాపల్లి: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు: DIEO

image

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియటి మొదటి రెండో సంవత్సరం వార్షిక పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 22 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజుకు రూ.5000 విద్యార్థులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అనకాపల్లి DIEO మద్దిల వినోద్ బాబు కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు తెలిపారు.

News December 16, 2025

మక్తల్: సర్పంచ్ ఎన్నికలు.. క్షుద్ర పూజల కలకలం

image

మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మామ.. ప్రత్యర్థి పార్టీల సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్ల ముందు నవధాన్యాలు, కుంకుమ, పసుపుతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 16, 2025

పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

image

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.