News November 15, 2024

కామారెడ్డి: ఏసీబీకి చిక్కిన పోలీసులు.. UPDATE

image

కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడి దగ్గరి నుంచి నుంచి సదరు పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రైటర్ రామస్వామికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

Similar News

News April 18, 2026

NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

image

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.

News April 17, 2026

TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

image

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.

News April 17, 2026

LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

image

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.