News January 6, 2025
కామారెడ్డి: ఓటర్ల లిస్టును ప్రకటించిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం తుది ఓటర్ల లిస్ట్ వివరాలు ప్రకటించినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 6,90,317 ఓటర్లు కాగా, 3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది స్త్రీలు, 32 మంది ఇతరులని తెలిపారు. నియోజక వర్గాల వారీగా ఓటర్ల వివరాలను సైతం తెలిపారు. అదేవిధంగా 600 మంది సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారన్నారు.
Similar News
News January 9, 2025
NZB: దారుణం.. వీధి కుక్క నోట శిశువు మృతదేహం
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో దారుణ ఘటన ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోర్గం గ్రామంలో రోడ్డుపై ఓ వీధి కుక్క తన నోటితో ఒక మగ శిశువు మృతదేహాన్ని పట్టుకుని పరిగెడుతోంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను తరిమికొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి బొడ్డు తాడు అలాగే ఉండగా పుట్టగానే ఎవరో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
News January 9, 2025
కామారెడ్డి: కొడుకును కాపాడటానికి వచ్చి తండ్రి మృతి
కొడుకును కాపాడటానికి వెళ్లిన తండ్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాగిర్తి పల్లికి చెందిన పెద్ద నర్సింలు కుమారుడు మంగళవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో నర్సింలును రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 9, 2025
కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి
కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.