News January 25, 2025

కామారెడ్డి: ఓటర్ దినోత్సవం సందర్భంగా కళాజాత

image

కామారెడ్డిలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కళాజాత కార్యక్రమం నిర్వహించినట్లు కళాజాత ప్రతినిధి ఆకుల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీపీఆర్‌ఓ, జిల్లా వివిధ శాఖ అధికారులు, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

image

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News December 1, 2025

ఉద్యోగుల బేసిక్ PAYలో 50% DA మెర్జ్? కేంద్రం సమాధానమిదే

image

ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో DA నుంచి కొంత మొత్తాన్ని మెర్జ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 50% DAను వెంటనే బేసిక్ పేలో కలపాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్‌సభలో సమాధానమిచ్చింది. కాగా ఒకవేళ బేసిక్ PAYలో 50% డీఏ కలిస్తే ఎంట్రీ లెవల్ బేసిక్ పే ₹18వేల నుంచి ₹27వేలకి పెరగనుంది. అటు 8th పే కమిషన్ 2027లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.

News December 1, 2025

సిరిసిల్ల: ‘1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం’

image

సిరిసిల్ల జిల్లాలో 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మొత్తం జిల్లాలోని 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,085 మంది రైతుల నుంచి 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేయాలని ఆమె ఆదేశించారు.