News January 25, 2025

కామారెడ్డి: ఓటర్ దినోత్సవం సందర్భంగా కళాజాత

image

కామారెడ్డిలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కళాజాత కార్యక్రమం నిర్వహించినట్లు కళాజాత ప్రతినిధి ఆకుల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీపీఆర్‌ఓ, జిల్లా వివిధ శాఖ అధికారులు, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

54 ఏళ్ల తర్వాత..

image

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.

News July 5, 2025

ఏలూరు: SDG లక్ష్యాలను సాధిస్తాం

image

ఉభయగోదావరి జిల్లాలోని పంచాయతీ అధికారులకు పంచాయతీ పురోగతి సూచికపై శనివారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ కార్యనిర్వాహణాధికారి శ్రీహరి మాట్లాడారు. SDG కి సంబంధించిన 227 డేటా పాయింట్స్ ని PAI వెబ్ సైట్‌లో పొందుపరచడం‌పై శిక్షణ ఇవ్వడం జరిగినదని తెలిపారు. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామన్నారు.

News July 5, 2025

NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

image

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.