News January 27, 2025

కామారెడ్డి: కంది కొనుగోలుకు 8 కేంద్రాలు ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో కంది పంటకు కొనుగోలుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. క్వింటల్  రూ.7,550 చెల్లించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, తాడ్వాయి, బాన్సువాడ మండలం బోర్లం, గాంధారి, సదాశివనగర్ పద్మాజీ వాడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.

Similar News

News January 8, 2026

సర్ఫరాజ్ రికార్డు.. 15 బాల్స్‌లో 50

image

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ VHTలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశారు. పంజాబ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 15బాల్స్‌లో 50 రన్స్ చేసి చరిత్ర సృష్టించారు. దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ (62) అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4 బాది 30 పరుగులు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడింది. ఇంతకుముందు ఈ రికార్డు బరోడా బ్యాటర్ అతీత్ శేఠ్ (16 బాల్స్‌లో 50) పేరున ఉంది.

News January 8, 2026

త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

image

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.

News January 8, 2026

‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ, వైద్య-ఆరోగ్యం, విద్య, జల్ జీవన్ మిషన్, అమృత్, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.