News January 27, 2025

కామారెడ్డి: కంది కొనుగోలుకు 8 కేంద్రాలు ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో కంది పంటకు కొనుగోలుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. క్వింటల్  రూ.7,550 చెల్లించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, తాడ్వాయి, బాన్సువాడ మండలం బోర్లం, గాంధారి, సదాశివనగర్ పద్మాజీ వాడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.

Similar News

News February 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల

image

AP: మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఈరోజు ఉదయం 10 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపుల్ని ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

News February 18, 2025

నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

image

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

News February 18, 2025

NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

image

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

error: Content is protected !!