News February 20, 2025
కామారెడ్డి: కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7 ఏళ్ల శిక్ష

కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 7ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. బీబీపేట PS పరిధిలో తల్లి ఇంట్లో లేని సమయంలో 15 ఏళ్ల కుమార్తెపై తండ్రి దేవరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి రాగానే జరిగిన విషయాన్ని ఆమె చెప్పగా PSలో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పును వెలువరించారు.
Similar News
News December 3, 2025
ఐబొమ్మ రవికి బంపరాఫర్?

ఐబొమ్మ రవి కేసులో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడని వార్త సారాంశం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని టాక్.
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.


