News February 20, 2025
కామారెడ్డి: కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7 ఏళ్ల శిక్ష

కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 7ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. బీబీపేట PS పరిధిలో తల్లి ఇంట్లో లేని సమయంలో 15 ఏళ్ల కుమార్తెపై తండ్రి దేవరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి రాగానే జరిగిన విషయాన్ని ఆమె చెప్పగా PSలో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పును వెలువరించారు.
Similar News
News March 19, 2025
కల్లూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తాళ్ల శ్రీనివాసరావు (అడిషనల్ డైరెక్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్) మృతి చెందారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్థులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఇటీవలే గ్రామానికి వచ్చినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 19, 2025
హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

TG: మెక్‌డొనాల్డ్స్ తన గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు CM రేవంత్ మెక్‌డొనాల్డ్స్ CEO క్రిస్ కెమ్‌కిన్స్కితో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లు ఉండగా, ఇక నుంచి ఏటా 3- 4 కొత్త అవుట్‌లెట్‌లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రైతులు దాని కార్యకలాపాలకు తాజా ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు.
News March 19, 2025
సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.