News March 18, 2025
కామారెడ్డి కలెక్టరేట్‌కు మళ్లీ రప్పించారు

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్‌ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
Similar News
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.