News January 26, 2025
కామారెడ్డి: కలెక్టరేట్‌లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాన్సువాడ, రాజంపేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తిలకించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.
Similar News
News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
News February 12, 2025
NZB: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.
News February 12, 2025
INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.