News January 27, 2025
కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో మృతదేహం లభ్యం

కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ఉన్న జాతీయ రహదారి పక్కన ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 27, 2025
ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.
News November 27, 2025
పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.
News November 27, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


