News January 25, 2025
కామారెడ్డి కలెక్టర్‌కు అవార్డు

కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కు 2024 ఏడాదికి గాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. కాగా ఆయన గతేడాది నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎన్నికలకు సంబంధిచిన నిర్వహణ, ఓటర్ నమోదులో విశేష కృషికి ఈ అవార్డు అందుకోనున్నారు.
Similar News
News December 16, 2025
త్రివిక్రమ్.. కెరీర్లో తొలిసారి!

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News December 16, 2025
‘జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికలు లేవు’

చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క జూలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 10 ఏకగ్రీవంగా ఖరారయ్యాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.
News December 16, 2025
ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


