News January 25, 2025

కామారెడ్డి కలెక్టర్‌‌కు అవార్డు

image

కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కు 2024 ఏడాదికి గాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. కాగా ఆయన గతేడాది నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ, ఓటర్ నమోదులో విశేష కృషికి ఈ అవార్డు అందుకోనున్నారు.

Similar News

News September 14, 2025

యాదాద్రి భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు కియోస్క్ యంత్రాలను ఈవో వెంకట్రావు ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

News September 14, 2025

గురుభట్లగూడెంలో జ్వరంతో వ్యక్తి మృతి

image

చింతలపూడిలోని గురుభట్లగూడేనికి చెందిన చక్రపువాసు (60) జ్వరంతో మృతి చెందారు. 20 రోజుల నుంచి జ్వరం తీవ్రమై కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతిన్నాయి. తీవ్రమైన రక్తహీనత రావడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియడంతో ఆదివారం AMC మాజీ ఛైర్మన్ ముత్తారెడ్డి, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు గుత్తావేంకటేశ్వరరావు నివాళులు అర్పించారు.

News September 14, 2025

విజయవాడ: డయేరియా వైద్య శిబిరం వద్ద భారీగా వైద్యులు

image

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా వైద్య శిబిరం మొత్తం భారీ స్థాయిలో వైద్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 మంది వైద్యులు, ముగ్గురు ప్రత్యేక వైద్యులు, ముగ్గురు రాపిడ్ టెస్టింగ్ వైద్యులు, 36 మంది నర్సులు, 60 మంది ఆశా కార్యకర్తలను శిబిరం వద్ద విధుల నిమిత్తం కేటాయించింది. వీరిలో వైద్యులు నర్సులు ఆశా కార్యకర్తలు 20 బృందాలు ఏర్పడి న్యూ ఆర్ఆర్ పేటలోని ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు.