News January 25, 2025
కామారెడ్డి కలెక్టర్‌కు అవార్డు

కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కు 2024 ఏడాదికి గాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. కాగా ఆయన గతేడాది నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎన్నికలకు సంబంధిచిన నిర్వహణ, ఓటర్ నమోదులో విశేష కృషికి ఈ అవార్డు అందుకోనున్నారు.
Similar News
News February 19, 2025
ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉ.10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు పని చేస్తాయి.
News February 19, 2025
అనకాపల్లి: మహిళల భద్రతపై దృష్టి పెట్టాలి

మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. విశాఖ రేంజ్ కార్యాలయం నుంచి అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయి రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
News February 19, 2025
PPM: డీఐఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు

పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి డి.మంజుల వీణకు ఆచార్య దేవోభవ అవార్డు లభించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలుగా, ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐఓగా, పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారిగా సేవలు అందించారు. ఈ మేరకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 2025 ఏడాదికి ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంజుల వీణను బుధవారం అభినందించారు.