News October 27, 2024

కామారెడ్డి కలెక్టర్‌, ఎస్పీకి MLA ఫిర్యాదు

image

కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై డివైడర్‌ను కూల్చివేసిన నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు. వెంటనే నిందితులను గుర్తించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News November 4, 2024

హత్య కేసును చేధించిన సదాశివనగర్ పోలీసులు

image

సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేధించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను వెల్లడించారు. గంగాధర్ అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కృష్ణ వద్ద నుంచి గంగాధర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పును ఇవ్వొద్దనే దురుద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు.

News November 4, 2024

లింగంపేట్: ఉపాధ్యాయులుగా అన్నాచెల్లెళ్ల ఎంపిక

image

మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు కొండా సంజీవ్, శ్యామల స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్లుగా ఒకేసారి ఎంపికయ్యారు. ఇద్దరూ బీబీపేట్ మండలంలోని పలు పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమను ప్రోత్సహించి సహకరించిన వారికి వారిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఒకేసారి ఉద్యోగాలు సాధించిన వారిని గ్రామస్థులు అభినందించారు.

News November 4, 2024

నిజామాబాద్ జిల్లాలో నేడు మీ సేవలు బంద్

image

సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు జిల్లా మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు.