News August 8, 2024
కామారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్.. డబ్బులు పంపాలని మెసేజ్

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్ప్లే పిక్చర్ వినియోగిస్తూ డబ్బులు పంపాలని కలెక్టరేట్ ఏటీఓకు మెసేజ్ చేశారు. కలెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మసూర్.. కలెక్టర్ పేరిట దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
NZB: STU ఏడు మండలాల కార్యవర్గ సభ్యుల ఎన్నిక

నిజామాబాద్ జిల్లాలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఏడు మండలాల కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎడపల్లి మండల అధ్యక్షుడిగా యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా భూపతి ఎన్నికయ్యారు. నవీపేట అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. అదే విధంగా నిజామాబాద్ నార్త్, సౌత్, డిచ్పల్లి, ఆలూరు, మోపాల్ మండలాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు.
News September 14, 2025
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.