News April 12, 2025
కామారెడ్డి: కల్తీ కల్లు ఘటన.. సీఎం సమీక్ష..?

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష జరిపి వరుస కల్తీ ఘటనలపై ఆరా తీయనున్నారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరుకానున్నారు. దామరంచ, అంకోల్, దుర్కి, సంగెం మండలాల్లో 69మంది, గౌరారంలో 30మంది కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురుని అరెస్టు చేశారు. 27మందిపై కేసు నమోదుచేశారు.
Similar News
News April 18, 2025
గద్వాల జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్‌పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలపై రివ్యూ సమావేశం పోలీస్ అధికారులతో నిర్వహించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడాలన్నారు.
News April 18, 2025
గద్వాల: ‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటియూ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.వెంకటస్వామి, వీవీ నరసింహ పిలుపునిచ్చారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు.
News April 18, 2025
పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: వనపర్తి జిల్లా ఎస్పీ

విద్యార్థులు చిన్నతనం నుంచే వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొని పోటీతత్వం అలవర్చుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివిధ పోటీ పరీక్షల్లో బహుమతులు సాధించిన వివిధ పాఠశాలల విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పోటీ పరీక్షలు రాసి జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.