News January 28, 2025

కామారెడ్డి: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి: కలెక్టర్

image

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్‌డే సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా నిరంతరం సాధన చేయాలని సూచించారు. క్రమశిక్షణతో ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. దాతల సహకారంతో కళాశాలకు అవసరమైనవి సమకూర్చుకోవాలని సూచించారు.

Similar News

News December 9, 2025

నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: http://recruit.ncl.res.in/

News December 9, 2025

చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

image

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.

News December 9, 2025

ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

image

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.