News June 14, 2024
కామారెడ్డి: కాంగ్రెస్ నేతలను కలిసిన ఎంపీ

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించినందుకు వారు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.


