News March 5, 2025
కామారెడ్డి: కారు ఢీకొని మహిళ మృతి

కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అతివేగంగా నడిపి చిన్న మల్లారెడ్డి గ్రామంలో మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
ఓబెరాయ్ హోటల్కు 20 ఎకరాల స్థలం

తిరుపతిలో ఓబెరాయ్ హోటల్కు ప్రభుత్వం 20ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. SRO రేటులో 1% చొప్పున లీజు అద్దె నిర్ణయించింది. రూ.26.08 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించింది. విద్యుత్ కనెక్షన్ ఖర్చులు, కన్సల్టేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫీజుల సర్దుబాటుకు నిరాకరించింది. TTDతో ఎక్స్ఛేంజ్ డీడ్ కోసం రూ.32.60 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించింది.
News December 14, 2025
భవానీ దీక్షల విరమణ.. 3.75 లక్షల మంది అమ్మవారి దర్శనం

భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ నెల 11 నుంచి సుమారు 3.75 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. భక్తులకు దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, ఉచిత రవాణా వంటి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఆయన వెంట ఈవో శీనా నాయక్ ఉన్నారు.
News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @1PM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా 1PM గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 83.9% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 79.6%, కొత్తకోట 84.5%, మదనాపూర్ 86.2%, ఆత్మకూరు 83.8%, అమరచింత 89.2% పోలింగ్ నమోదైంది.


