News March 5, 2025

కామారెడ్డి: కారు ఢీకొని మహిళ మృతి

image

కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అతివేగంగా నడిపి చిన్న మల్లారెడ్డి గ్రామంలో మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ షురూ

image

మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. 5 మండలాల్లోని 155 గ్రామాలు, 1,338 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

News December 11, 2025

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ షురూ

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. 4 మండలాల్లోని 82 గ్రామాలు, 712 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

News December 11, 2025

NTR: వాటా ఇస్తానని చెప్పి.. రూ.84 లక్షలు స్వాహా..!

image

గ్యాస్ కంపెనీలో వాటా ఇస్తానని మోసం చేసిన వ్యక్తి‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భవానీపురానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తికి గ్యాస్ ఏజెన్సీ‌లో వాటా ఇస్తానంటూ పలుమార్లు అతని వద్ద నుంచి హరికృష్ణ పలు దఫాలుగా రూ.84 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ వాటాలు ఇవ్వకపోవడంతో సాయికుమార్ ప్రశ్నించాడు. హరికృష్ణ ఇంటికి పిలిచి అనుచరులతో దాడి చేయించాడని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.