News February 24, 2025
కామారెడ్డి: కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ అమలు పరచాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.
Similar News
News February 25, 2025
ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్‌కు లింకులు

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్లలో హాల్ టికెట్లు అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
News February 25, 2025
టీసీ వరుణ్‌కు కీలక బాధ్యతలు

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు టీసీ వరుణ్, హిందూపురం పార్లమెంట్‌కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
News February 25, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

AP: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.