News February 20, 2025
కామారెడ్డి: కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కంటి వైద్య శిబిరం కొనసాగిస్తున్నట్లు అప్తాల్మిక్ వైద్యులు లింబాద్రి, రవీందర్, రంజిత తెలిపారు. కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, KGBV, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు రీస్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పలువురికి అద్దాలు వాడాలని సూచించమన్నారు.
Similar News
News November 19, 2025
సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
News November 19, 2025
జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.


