News February 20, 2025
కామారెడ్డి: కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కంటి వైద్య శిబిరం కొనసాగిస్తున్నట్లు అప్తాల్మిక్ వైద్యులు లింబాద్రి, రవీందర్, రంజిత తెలిపారు. కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, KGBV, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు రీస్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పలువురికి అద్దాలు వాడాలని సూచించమన్నారు.
Similar News
News July 5, 2025
నాగర్‌కర్నూల్‌లో రేబిస్ వ్యాధి టీకాలు

ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో రేబిస్ వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నాగర్‌కర్నూల్ పశువైద్యశాలలో ఈ టీకాలు వేయనున్నట్లు అని జిల్లా పశువైద్యశాఖ అధికారి జ్ఞానశేఖర్ తెలిపారు. శునకాల ప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
News July 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ రేపు ఉపమాక గరుడాద్రి పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ
➤ జలాశయాల్లో చేపలవేటకు నిషేధం
➤ అభివృద్ధి సూచికపై శిక్షణలో పాల్గొన్న ఎంపీడీవోలు
➤ పోలవరం ప్రాజెక్టు డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుందరపు
➤ స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలిపిన సీపీఐ
➤ మాడుగుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
➤ గురుజాపాలెంలో ఆటిజం శిక్షణా కేంద్రం ఏర్పాటు