News March 18, 2025
కామారెడ్డి: కోతి కల్లు తాగితే..!

ముందే కోతి.. ఆపై కల్లు తాగితే.. అనే సామెత నిజమనిపిస్తోంది ఈ చిత్రం చూస్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక చెట్టు వద్ద చెట్టు నుంచి కల్లు దింపిన గౌడన్న కింద మోటార్ సైకిల్‌కు కల్లు బిందెను ఉంచి మరో చెట్టు పైకి కల్లు కోసం వెళ్లగా ఇదే అదనుగా చూసిన కోతి కల్లును ఎంచక్కా తాగింది. అనంతరం నెమ్మదిగా జారుకుంది. ఇది చూసిన కొందరు ముందే కోతి.. ఆపై కల్లు తాగింది.. ఇప్పుడెలా అంటూ చర్చించుకున్నారు.
Similar News
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై శిక్షణ: డీఈవో

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి విడత శిక్షణకు హాజరుకాని అధికారులు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరు కావాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.


