News February 12, 2025

కామారెడ్డి: క్వింటాకు రూ.7550 చెల్లిస్తాం: మార్కోఫెడ్ జిల్లా మేనేజర్

image

కందులు క్వింటాకు మద్దతు ధర రూ.7,550 చెల్లిస్తామని మార్కోఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంటను సాగు చేయడంతో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోర్లం, తాడ్వాయి, గాంధారి, పద్మాజీవాడి వద్ద కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 27, 2025

సంపాదనలో రష్మిక మందన్న టాప్

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.

News March 27, 2025

ప్రారంభానికి సిద్ధంగా “VMRDA THE DECK”

image

సిరిపురం నిర్మాణంలో ఉన్న నూతన “VMRDA THE DECK” త్వరలో ఓపెన్ కాబోతుంది. ఇందులో 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, 6 అంతస్తుల్లో కమర్షియల్‌కి సదుపాయం కల్పించబోతున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.87.50 కోట్లు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అతి త్వరలో దీనిని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమయ్యాక పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. ఇందులో 4వీలర్, 2వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు.

News March 27, 2025

రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు

image

దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 45 శాతానికి పడిపోయినట్లు CWC నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే 25 శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 బీసీఎంలు ఉండగా ప్రస్తుతం 8,070 బీసీఎంలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో ఈ నీటి నిల్వలు మరింతగా అడుగంటనున్నాయి.

error: Content is protected !!