News March 2, 2025
కామారెడ్డి: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..

ఉమ్మడి NZB, KNR, MDK, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News January 3, 2026
‘ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి’

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రవాణా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలను గుర్తించాలన్నారు. అక్కడ వెంటనే హెచ్చరిక బోర్డులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 3, 2026
హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
News January 3, 2026
కరీంనగర్: డీజేలు, డ్రోన్లపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శబ్ద కాలుష్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ సెట్ల వినియోగానికి సంబంధిత ఏసీపీల అనుమతి పొందాలని ఆయన సూచించారు.


