News January 27, 2025
కామారెడ్డి: జిజిహెచ్ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లోని పలు ఉద్యోగులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది ఆదివారం ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పలు విభాగాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
News February 12, 2025
శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.