News January 22, 2025
కామారెడ్డి జిల్లాకు పామాయిల్ తయారీ యూనిట్

కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం యూనిలివర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందంతో యూనిలివర్ కంపెనీ ప్రతినిధులు జరిపిన చర్చల అనంతరం అంగీకరించారు. పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Similar News
News February 16, 2025
హైదరాబాద్‌లో ఎన్నికల సందడి

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికలపై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.
News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.
News February 16, 2025
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.