News April 2, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మద్నూర్‌ మండలం సోమూర్‌లో 39.7°C ఉష్ణోగ్రత నమోదైంది. సర్వపూర్‌లో 39.2°C, పెద్ద కొడప్గల్ 39.1°C, మేనూర్, గాంధారిలో 39.0°C, జుక్కల్‌లో 38.9°C, నిజాంసాగర్‌లోని మాక్డూంపూర్, నస్రుల్లాబాద్ 38.8°C, బిచ్కుంద 38.7°C బీర్కూర్ 37.8 °C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News April 19, 2025

VKB: తెలంగాణ శాసనసభ పతి పర్యటన వివరాలు

image

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు బంట్వారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించనున్న రైతు సదస్సులో స్పీకర్ పాల్గొంటారు. మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న రైతు సదస్సులో పాల్గొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు. మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు.

News April 19, 2025

NRPT: పాఠశాలల్లో సర్వే నిర్వహిస్తున్న డైట్ విద్యార్థులు

image

నారాయణపేట జిల్లాలోని వివిధ పాఠశాలల్లో డైట్ చదువుతున్న విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా తమకు కేటాయించిన పాఠశాలను సందర్శించి, ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్య, మధ్యాహ్న భోజన వివరాలు, తరగతి గదులు, మూత్రశాలలు, వంటగది ఉన్నాయా అనే అంశాలపై వారు వివరాలు సేకరిస్తున్నట్టు ఛాత్రోపాధ్యాయురాలు పూజ తెలిపారు.

News April 19, 2025

AMP: ‘ఈనెల 30లోపు E-KYC నమోదు చేసుకోవాలి’

image

కోనసీమ జిల్లాలోని ప్రతి రేషన్ కార్డుదారుడు E-KYC ఈ నెలాఖరునాటికి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ కోరారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడు తమకు వచ్చే బియ్యం పంపిణీ ఆగిపోకుండా ఉండాలంటే రేషన్ కార్డుదారులు E-KYCని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. E-KYC స్టేటస్ ఆన్‌లైన్, రేషన్ వాహనాలు వద్ద నమోదు చేయాలన్నారు.

error: Content is protected !!