News May 25, 2024
కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం

కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి కలకలం రేపింది. లింగంపేటలోని మేంగారం-బోనాల్ మధ్య ఉన్న రోడ్డు పై ఎలుగుబంటి సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు తాగేందుకు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ విజయంపై ఎంపీ అర్వింద్ హర్షం

ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో శనివారం ఢిల్లీలో వారిని ఎంపీ కలిసి అభినందించారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.
News February 8, 2025
ఆర్మూర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని శనివారం పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య(41) తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సీఐ వివరించారు.
News February 8, 2025
NZB: పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఉండాలి: కలెక్టర్

ఈ నెల 27న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో మొదటి విడత శిక్షణ తరగతులలో కలెక్టర్ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.