News April 9, 2025
కామారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఎన్నంటే..?

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ట్రాఫిక్ ఉల్లంఘనల నివేదికను కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర మంగళవారం విడుదల చేశారు. నమోదైన ఉల్లంఘనల్లో.. విత్ అవుట్ హెల్మెట్, అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్లడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటివి ఉన్నాయి. వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి 1,19,606 చలాన్లు విధించారు.
Similar News
News October 30, 2025
నంచర్ల గేట్ వద్ద కారు-బొలెరో ఢీ.. నలుగురికి గాయాలు

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గేట్ బస్టాండ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు-బొలెరో ఢీకొనడంతో కారులో ఉన్న విష్ణు, మల్లేష్, శేఖర్కు గాయాలయ్యాయి. బొలెరోలో కర్నూలుకు వెళుతున్న రోషన్కు కూడా తలకు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ బాషా, పైలట్ అక్బర్ అక్కడే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News October 30, 2025
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.
News October 30, 2025
ఆదిలాబాద్: ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


