News February 12, 2026
కామారెడ్డి జిల్లాలో తగ్గని చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గాంధారి మండలం రామ్‌లక్ష్మణ్‌పల్లిలో అత్యల్పంగా 13.8 డిగ్రీలు నమోదు కాగా, గాంధారిలో 14.1, లచ్చపేటలో 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జుక్కల్, పెద్ద కొడపగల్‌లో 14.7, మద్నూర్‌లో 14.8 డిగ్రీలుగా రికార్డయ్యాయి. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News March 12, 2026
కోనసీమ: ఏప్రిల్ 30 తేదీలోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ- ఈడీ

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-18 సంవత్సరాల్లో ఎస్సీలు లబ్ధిదారులు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసిందని ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి గురువారం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ బకాయిదారులు ఏప్రిల్ 30 తేదీలలోగా అసలు చెల్లిస్తే డిసెంబరు 2025 వరకు ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 12, 2026
పెద్దపల్లి: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పదకొండవ రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. గురువారం నిర్వహించిన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు మొత్తం 4,999 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,845 మంది పరీక్ష రాశారు. 154 మంది గైర్హాజరు కాగా 96 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వెల్లడించారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగాయని తెలిపారు.
News March 12, 2026
జగిత్యాల: ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు జమ

జగిత్యాల జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.1,95,93,935 జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా కింద నిధులు విడుదల చేసిందన్నారు.


