News April 6, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు అత్యధికంగా బిచ్కుందలో 39.9డిగ్రీలు, మద్నూర్ 39.8, నస్రుల్లాబాద్ 39.5, నిజాంసాగర్ 39, బాన్సువాడ, సదాశివనగర్, డోంగ్లిలో 38, భిక్నూర్ 37.9, పిట్లంలో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Similar News
News September 14, 2025
బిజినేపల్లి అత్యధిక వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బిజినేపల్లి మండల కేంద్రంలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 48.5, కొండారెడ్డిపల్లి 45.0, పాలెం 35.5, మంగనూర్ 32.8, తెలకపల్లి 29.5, కిష్టంపల్లి 17.0, తోటపల్లి 15.0, ఉప్పునుంతల 7.5, కొల్లాపూర్ 11.3, లింగాల 6.8, ఐనోల్ 6.5, కల్వకుర్తి 3.0, ఊర్కొండ 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News September 14, 2025
NRPT: చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

అంతిమంగా ఉచిత చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేప పిల్లల పెంపకం కేంద్రాల నిర్వహకులకు జరిపిన సాంకేతిక నైపుణ్యం,నాణ్యత నిర్దేశాలకు అనుగుణంగా నారాయణపేట జిల్లాకు ఒక్కరే బిడ్ దాఖలు చేసినప్పటికీ గత్యంతరం లేక అధికారులు ఆమోదం తెలిపారు. గత నెలలోనే చెరువులు నిండుకున్న నేపథ్యంలో పంపిణీ ఆలస్యం అయిన తరుణంలో చేప పిల్లల సైజు, నాణ్యత ప్రమాణాలు పాటించడం ఇబ్బందికరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News September 14, 2025
తురకాపాలెం వరుస మరణాలకు కారణం యురేనియం?

తురకాపాలెంలో మరణమృదంగం కలకలం రేపింది. ఐతే మరణాలకు గల కారణాలు ఆ ప్రాంతంలోని యురేనియం అవశేషాలే అన్నట్లుగా చెన్నై ప్రయోగశాల నిర్ధారణ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల నమూనాలను సేకరించి చెన్నై ల్యాబ్కు పంపగా ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రాతంలో క్వారీలు ఉండటంతో అక్కడ నీటిని పలు సమయాల్లో వాడటంతోనే సమస్య ఏర్పడిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికారులు తెలిపిన వాటికి చెన్నై రిపోర్టు భిన్నంగా ఉంది.