News March 4, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR: యాసంగికి సాగు నీరివ్వాలి: సీఎస్ 
* ఎల్లారెడ్డిలో పోలీసుల కవాతు
* రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్
* ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: బీసీ విద్యార్థి సంఘం
* ప్రజావాణికి 52 ఫిర్యాదులు: KMR కలెక్టర్
* జాతీయ విలు విద్య పోటీలకు బిక్కనూరు విద్యార్థి 
* హామీలు అమలు చేసే వరకు పోరాటం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ 
* ఇందిరమ్మ ఇళ్ల నమూనా పరిశీలన
* పింఛన్ కోసం పడిగాపులు

Similar News

News December 9, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్‌డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.

News December 9, 2025

రామన్నపేట ఆర్‌ఐ రాజేశ్వర్‌ సస్పెండ్‌

image

రామన్నపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్‌ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్‌ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.

News December 9, 2025

మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

image

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.