News March 12, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR: నేటి నుంచి బడ్జెట్.. ఈ పనులపై గళం విప్పాలి.!
* లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి: KMR కలెక్టర్
* కామారెడ్డి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు..207 మంది గైర్హాజర్
* గస్తీలు నిర్వహిస్తేనే నేరాలకు అడ్డుకట్ట: KMR ఎస్పీ
* వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: KMR కలెక్టర్
* కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారినిగా వీణ
* ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న MLA పోచారం
Similar News
News December 7, 2025
10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
News December 7, 2025
నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
News December 7, 2025
పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.


