News March 16, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున నిజాంసాగర్‌లోని హాసన్‌పల్లి, పాల్వంచలోని ఎల్పుగొండ, 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డోంగ్లి, జుక్కల్ 41.4, మద్నూర్‌లోని మేనూర్ 41.2, పిట్లం 41.1, మద్నూర్‌లోని సోమూరు, నాగిరెడ్డిపెట్, ఎల్లారెడ్డిలోని మచపూర్‌లో 40.9,బిచ్కుంద, దోమకొండ 40.7, కామారెడ్డిలోని కలక్టరేట్‌లో, గాంధారి, సర్వపూర్ 40.5°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News March 17, 2025
రాజేంద్రనగర్ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
News March 17, 2025
భువనగిరి కోటపైన రోప్ వే

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.
News March 17, 2025
Stock Markets: నిఫ్టీ 150+, సెన్సెక్స్ 450+ అప్

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,549 (+153), సెన్సెక్స్ 74,275 (+470) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎనర్జీ, PSE, CPSE, వినియోగం, చమురు, బ్యాంకు షేర్లకు గిరాకీ ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఎగిశాయి. ఇండస్‌ఇండ్, బజాజ్ ట్విన్స్, SBI లైఫ్, Dr రెడ్డీస్ టాప్ గెయినర్స్. నెస్లే, BPCL టాప్ లూజర్స్.