News April 14, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు ఇలా…!

కామారెడ్డి జిల్లాని బిచ్కుంద మండలంలో నిన్న అత్యధిక ఉష్ణోగ్రత. మండలంలో 42.0, బాన్స్ వాడ 41.9, మద్నూర్ 41.6, రామారెడ్డి 41.5, బిబిపేట్ 41.4, జుక్కల్ 41.3, బిక్కనూర్ 41.0, గాంధారి, డోంగ్లి లలో 40.9, సదాశివ్ నగర్, నిజాంసాగర్ మండలాలలో 40.8, కామారెడ్డిలో 40.6, అత్యల్పంగా పెద్దకొడప్గల్లో 37.7 ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 4, 2025
సంగారెడ్డి: పీఎంశ్రీ నిధుల వినియోగంపై అవగాహన

సంగారెడ్డి జిల్లాలో పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మంగళవారం హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరయ్యారు. పాఠశాలల నిర్వహణపై, పీఎం శ్రీ పథకం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై హెచ్ఎంలకు అవగాహన కల్పించినట్లు జిల్లా సెక్టోరియల్ అధికారులు బాలయ్య, వెంకటేశం తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
News November 4, 2025
రాజోలిలో అత్యధిక వర్షపాతం

గద్వాల జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు 17.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజోలి మండలంలో 31.0 మి.మీ. వర్షం కురవగా, ఇటిక్యాలలో 7.3 మి.మీ. తో తక్కువ వర్షపాతం నమోదైంది. ధరూరులో 26.9 మి.మీ., అలంపూర్‌లో 25.4 మి.మీ., గట్టులో 22.5 మి.మీ., అయిజలో 20.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News November 4, 2025
సంగారెడ్డి: కానిస్టేబుల్ సూసైడ్.. సీపీ సజ్జనార్ స్పందన

ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై అప్పుల బాధ తాళలేక కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బెట్టింగ్‌పై అవగాహన కల్పించాల్సిన వ్యక్తి దానికే బానిసై ప్రాణాలు తీసుకోవడం బాధాకరమన్నారు. జీవితంలో ఒడుదొడుకులు సహజమని, కానీ సమస్యకు చావు పరిష్కారం కాదని సూచించారు.


