News January 22, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత అధికమై ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. జిల్లాలో అత్యల్పంగా మేనూర్ 9.6, జుక్కల్ 9.7, గాంధారి 9.5, లచ్చపేట 10.8, సర్వాపూర్, వెల్పుగొండలో 11.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

Similar News

News September 14, 2025

RGM: సింగరేణి OCP-5 ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ED

image

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ED), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ శనివారం రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 ను సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా ప్రక్రియ పని విధానం గురించి అధికారులతో ప్రస్తావించారు. అనంతరం పవర్ హౌస్ వద్ద ఉన్న పార్కును పరిశీలించి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. RG-1 GMలలిత్ కుమార్ పాల్గొన్నారు.

News September 14, 2025

పెదవాగు రిజర్వాయర్‌కి వరద ఉద్ధృతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

పెదవాగు రిజర్వాయర్‌కి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్‌లో 1800-233-1077, 94910 41419, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్‌లో 83092 69056, వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయంలో 8328696546 మూడు చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 14, 2025

నూజివీడులో విద్యుత్ ఘాతంతో లారీ డ్రైవర్ మృతి

image

నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుంచి మామిడి పుల్ల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ ఘాతానికి గురికావడంతో డ్రైవర్ రవి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన రవి శనివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.